![]() |
![]() |
డాన్స్ ఐకాన్ సీజన్ 2 షో ఈ వారం ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. మెంటార్ జానులూరి ఆమె కంటెస్టెంట్ షోనాలి ఎలిమినేట్ ఇపోయారు. దాంతో వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసారు. ఐతే ఈసారి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటే గనక తిరిగి షోలోకి వస్తాం ఇచ్చి పడేస్తాం అని చెప్పింది జాను లూరి. "ఫస్ట్ ఎపిసోడ్ లో సోనాలికి హెల్త్ బాలేదు. దాంతో డాన్స్ చేసే ఎనర్జీ ఆమెలో ఎక్కువగా లేదు. సోనాలి హెల్త్ బాగుండి ఉంటే ఫైనల్స్ కొట్టేసే వాళ్ళం అంది జాను. చూసేవాళ్లకు ఎలిమినేషన్ అనేది అన్ ఫేర్ అనుకోవచ్చు కానీ తప్పు మా వైపే ఉంది. మేము కరెక్ట్ గ చేయకుండా అన్ ఫేర్ అనలేము. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఎలిమినేట్ అయ్యానేమో కానీ ఓంకార్ అన్న నన్ను మెంటర్ గా తీసుకుందాం అనుకున్నప్పుడే నేను గెలిచాను. అన్నతో జర్నీ చిన్నదే కానీ ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఫోక్ డాన్సర్ ని తీసుకొచ్చి ఒక మెంటార్ ప్లేస్ లో కూర్చోబెట్టారు. ఇంతకుముందు నేను డాన్సర్ ని మాత్రమే..మాష్టర్ డాన్స్ నేర్పిస్తే వెళ్లి వేయడమే..కానీ మెంటార్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. ఆ డాన్స్ చూడడం, మార్క్స్ వేయడం ఆ టెన్షన్ ఆమ్మో. ఇప్పుడు నాకు మెంటర్ కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏమో ఒకవేళ అవకాశం కూడా రావొచ్చేమో మళ్ళీ...షోలో సెకండ్ టైం వెళ్ళొచ్చేమో. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఈసారి కచ్చితంగా ఇచ్చి పడేస్తాం అని చెప్పారు సోనాలి, జానులూరి.
![]() |
![]() |